Sat Nov 23 2024 17:59:57 GMT+0000 (Coordinated Universal Time)
జేజే ఆస్పత్రిలో 61 మంది వైద్యులకు కరోనా !
మహారాష్ట్రలో కోవిడ్ తో పాటు ఒమిక్రాన్ కూడా విజృంభిస్తుండటంతో.. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా అక్కడ
మహారాష్ట్రలో కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్ ల వ్యాప్తితో రాష్ట్రం అల్లాడిపోతోంది. తాజాగా ముంబై నగరంలోని జేజే ఆస్పత్రిలో 61 మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.
మహారాష్ట్రలో కోవిడ్ తో పాటు ఒమిక్రాన్ కూడా విజృంభిస్తుండటంతో.. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా అక్కడ 18,466 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రస్తుతం అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 66,308కి చేరింది. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 653కి పెరిగాయి. మరోవైపు గోవా నుంచి ముంబై కి వచ్చిన క్రూయిజ్ షిప్ లో ప్రయాణికులు 1827 మంది కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా.. 66 మందికి కరోనా నిర్థారణ అయింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు అధికారులు.
Also Read : ఏపీలో భారీగా పెరుతున్న కరోనా కేసులు
Next Story