Fri Dec 20 2024 14:38:20 GMT+0000 (Coordinated Universal Time)
వైద్య చరిత్రలో అరుదైన ఘటన..నవజాత శిశువు కడుపులో 8 పిండాలు
కడుపునొప్పుకి మందులు వేసినా తగ్గకపోవడంతో.. సిటీస్కాన్ నిర్వహించారు. స్కానింగ్ లో పాప కడుపులో కణితులు ఆకారంలో ..
ప్రపంచ వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన ఇది. పుట్టి నెలరోజులు కూడా కాని నవజాత శిశువు కడుపులో 8 పిండాలను తొలించారు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాంచీలోని రామ్ గఢ్ లో అక్టోబర్ 10న ఓ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పటి నుండీ పాప కడుపునొప్పుతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులకు చూపించారు.
కడుపునొప్పుకి మందులు వేసినా తగ్గకపోవడంతో.. సిటీస్కాన్ నిర్వహించారు. స్కానింగ్ లో పాప కడుపులో కణితులు ఆకారంలో ఉన్నవి కనిపించారు. 21 రోజుల వైద్యుల పర్యవేక్షణ అనంతరం.. నవంబర్ 1వ తేదీన కణితులను తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. పాపకి ఆపరేషన్ చేస్తున్న వైద్యులు.. లోపల కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అవి కణితులు కావని, సరిగా అభివృద్ధి చెందని పిండాలని గుర్తించారు. గంటన్నరపాటు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. శిశువుల పొట్టలో అభివృద్ధి చెందని పిండాలు వెలుగు చూసిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా వందలోపే ఉన్నట్టు ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. కానీ.. నవజాత శిశువు కడుపులో ఏకంగా 8 పిండాలుండటం చాలా అరుదని పేర్కొన్నారు.
Next Story