Mon Nov 25 2024 22:52:14 GMT+0000 (Coordinated Universal Time)
మధ్యప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడు మృతి.. సీఎం ఎక్స్ గ్రేషియా
బోరుబావికి సమానంగా గొయ్యి తవ్వి, బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఈ లోగా అధికారులు..
బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. డిసెంబర్ 6, మంగళవారం సాయంత్రం ప్రమాద వశాత్తు బోరుబావిలో పడిన తన్మయ్ సాహు అనే 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నాలుగురోజుల క్రితం బెతుల్ జిల్లా, మాండవి గ్రామంలో తన్మయ్ పొలం దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు.. 55 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. గ్రహించిన తన్మయ్ అక్క.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. జిల్లా అధికారులు, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికి బాలుడు బ్రతికే ఉన్నాడు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఈ పనుల్ని పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు సమాచారమిచ్చారు. బోరుబావికి ఒక కెమెరా అమర్చి బాలుడి కదలికలను పరిశీలించారు.
బోరుబావికి సమానంగా గొయ్యి తవ్వి, బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఈ లోగా అధికారులు బాలుడికి ఆక్సిజన్, ఆహారం అందించే ప్రయత్నం చేశారు. గొయ్యి తీసే క్రమంలో బండరాళ్లు అడ్డుపడటంతో.. మరింత సమయం పట్టింది. నాలుగు రోజుల తర్వాత శనివారం (డిసెంబర్ 10)వేకుల జామున బాలుడిని బయటికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న తన్మయ్ ను హుటాహుటిన అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. దాంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. బాలుడి మృతిపట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. బాలుడి కుటుంబానికి రూ.లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Next Story