Fri Dec 20 2024 19:18:18 GMT+0000 (Coordinated Universal Time)
ఎనిమిదేళ్ల కాపురం తర్వాత భర్త స్త్రీ అని తెలిస్తే?
కొన్నిరోజులు మాట్లాడాక.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2014లో ఇద్దరికీ పెళ్లైంది. హనీమూన్ కి కాశ్మీర్ కి వెళ్లారు. కానీ..
పెళ్లై ఎనిమిదేళ్లు కాపురం చేశాక.. తన భర్త పురుషుడు కాదు.. స్త్రీ అన్న విషయం భార్యకు తెలిస్తే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలేంటి ? ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది. ఇలాంటి ఘటన గుజరాత్ లోని వడోదరలో జరిగింది. తన భర్త గతంలో అమ్మాయని తెలుసుకున్న భార్య.. షాక్ నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. విజైత అనే యువతిగా ఉన్న వ్యక్తి.. విజయ్ వర్థన్ పేరుతో తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనీలో పెట్టాడు. అప్పటికే పెళ్లై.. 14 ఏళ్ల కూతురున్న వడోదరకు చెందిన 40 ఏళ్ల మహిళ విజయ్ ప్రొఫైల్ ను చూసింది.
2011లో మహిళ మొదటి భర్త రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. విజయ్ తో కొన్నిరోజులు మాట్లాడాక.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2014లో ఇద్దరికీ పెళ్లైంది. హనీమూన్ కి కాశ్మీర్ కి వెళ్లారు. కానీ.. విజయ్ ఆమెతో సన్నిహితంగా ఉండలేకపోయాడు. కొత్త కాబట్టి కంగారుపడుతున్నాడనుకుంది. కానీ ఏళ్లు గడిచినా.. అతనిలో మార్పులేదు. ప్రతిసారీ ఇదేతంతు కావడంతో ఏం జరిగిందని బాధితురాలు ఆరా తీయడంతో సాకులు చెప్పాడు. తాను రష్యాలో ఉన్నప్పుడు కొన్నేళ్ల క్రితం ప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి శృంగారానికి పనికిరాకుండా పోయానని చెప్పాడు. అయితే, ఆ తర్వాత జరిగిన చిన్నపాటి సర్జరీ తర్వాత అంతా సర్దుకుందని నమ్మబలికాడు.
2020 జనవరిలో బరువు తగ్గేందుకు ఆపరేషన్ కోసం కోల్ కతా వెళ్తున్నానని చెప్పాడు. అక్కడి నుంచి వచ్చాక.. తాను లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారినట్లు అసలు విషయం చెప్పాడు. బాధితురాలు ఇదంతా పోలీసులకు చెప్పింది. తనను మోసం చేసి పెళ్లాడిన భర్తపై, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీకి చెందిన నిందితుడిని వడోదర తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.
Next Story