42 ఎయిర్ పోర్టుల్లో 84 మంది తూగుతూనే ఉద్యోగం చేస్తున్నారట
DGCA డేటా ప్రకారం జనవరి 2021- మార్చి 2022 మధ్య మద్యం పరీక్షల్లో 35 ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో
న్యూఢిల్లీ : ఎయిర్ పోర్టుల్లో తాగి పని చేస్తున్న వారి సంఖ్య బాగా ఎక్కువగానే ఉంటోందని ఏవియేషన్ విభాగం చెప్తోంది. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA డేటా ప్రకారం, 42 భారతీయ విమానాశ్రయాలలో పనిచేస్తున్న మొత్తం 84 మంది వ్యక్తులు తాగుతూనే, మద్యం మత్తులోనే పని చేస్తున్నట్లు గుర్తించారు. జనవరి 2021-మార్చి 2022 మధ్య వీరంతా డ్యూటీలో మద్యం సేవించినట్లు గుర్తించారు. వీరిలో 64 శాతం మంది అంటే 54 మందిని డ్రైవర్స్ గా గుర్తించారు. తప్పనిసరి ఆల్కహాల్ పరీక్షల్లో(mandatory alcohol tests) వీరంతా విఫలమయ్యారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా పేర్కొందని PTI తెలిపింది. ఆల్కహాల్ పరీక్షలలో విఫలమైన అనేక మంది కార్మికులు విమానాశ్రయ ఆపరేటర్లచే నియమించబడ్డారు, వారిలో ఎక్కువగా క్యాటరింగ్ కంపెనీలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీలు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కంపెనీలు మొదలైనవి ఉంటాయి.