Mon Dec 23 2024 06:56:42 GMT+0000 (Coordinated Universal Time)
India : దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పట్టుకున్న సొమ్ము ఎంతో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో భాగంగా 8,889 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది
దేశవ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో భాగంగా 8,889 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల క్రమంలో దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాలదే 45 శాతం వాటా అని తెలిపింది.
అత్యధికంగా డ్రగ్స్...
3,958 కోట్ల మేర డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది స్వాధీనం చేసుకున్న సొత్తులో నగదు .849.15 కోట్లు, 814.85 కోట్ల విలువైన మద్యాన్ని, 3,958 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను, బంగారం, వెండి వంటి ఆభరణాలు.1,260.33 కోట్లు విలువైనవి, ఇతర ఉచితాలు 2006.59 కోట్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
Next Story