Fri Jan 10 2025 08:27:11 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిన పానీ పూరీ.. 97 మందికి అస్వస్థత
జాతరలో ఒకే షాపులో పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులు అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్తో వారు బాధపడ్డారని
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పానీ పూరీ తిన్న చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని మండలా జిల్లాలో జరిగిన ఒక జాతరలో 'పానీ పూరీ' తిని తొంభై ఏడు మంది పిల్లలు ఫుడ్ పాయిజన్తో బాధపడ్డారని ఆరోగ్య అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో గిరిజనులు అధికంగా ఉండే సింగర్పూర్లో నిర్వహించిన జాతరలో బాధితులందరూ శనివారం సాయంత్రం ఒకే దుకాణం నుండి పానీపూరీ సేవించారని, సమీపంలోని వివిధ గ్రామాల ప్రజలు కూడా అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పిల్లలు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారని జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కెఆర్ శాక్య మీడియాకి తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 97 మంది చిన్నారులు జిల్లా ఆసుపత్రిలో చేరారని, వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు.
జాతరలో ఒకే షాపులో పానీ పూరీ తిన్న 97 మంది చిన్నారులు అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్తో వారు బాధపడ్డారని, వారిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించామని ఆదివారం మధ్యప్రదేశ్ వైద్య శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఆ పిల్లలందరూ వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారని వివరించారు. వారందరికీ వైద్యులు చికిత్స అందించారని, బాధిత పిల్లలు కోలుకుంటున్నారని తెలిపారు. పానీ పూరీ అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సంబంధిత అధికారులు పానీ పూరీ శాంపిళ్లను సేకరించి, వాటిని పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న పిల్లలను పలువురు మంత్రులు పరామర్శించారు.
Next Story