Mon Dec 23 2024 12:19:56 GMT+0000 (Coordinated Universal Time)
రెచ్చిపోతున్న మావోలు.. వంతెన పేల్చివేత
జార్ఖండ్ లో మావోలు రెచ్చిపోతున్నారు. వరుస దాడులు చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా గిరిదిహ్ జిల్లాలో
జార్ఖండ్ లో మావోలు రెచ్చిపోతున్నారు. వరుస దాడులు చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా గిరిదిహ్ జిల్లాలో డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 2- 2.30 గంటల మధ్య సింద్వారియా పంచాయతీ బరాకర్ నదిపై నిర్మించిన వంతెనను మావోలు డిటోనేటర్ తో పేల్చివేశారు. అంతకుముందే ఓ మొబైల్ టవర్ ను పేల్చేశారు.
వంతెన పేలిపోవడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెనను పేల్చివేసిన అనంతరం నక్సలైట్లు ఓ లేఖను విడుదల చేశారు. అరెస్టైన నక్సలైట్ ప్రశాంత్ బోస్ దంపతులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జనవరి 21 నుంచి 26వ తేదీ వరకు జరిగే ప్రతిఘటన మార్చ్ను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు.
Next Story