Fri Dec 20 2024 20:00:22 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో బీఎఫ్ 7 వేరియంట్
గుజరాత్ లో బీఎఫ్ 7 వేరియంట్ కేసు నమోదయింది. వైద్య నిపుణుల్లో ఇది ఆందోళన కలిగిస్తుంది.
గుజరాత్ లో బీఎఫ్ 7 వేరియంట్ కేసు నమోదయింది. వైద్య నిపుణుల్లో ఇది ఆందోళన కలిగిస్తుంది. ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో మూడు, నాలుగు వారాలో భారత్ లో ఈ ముప్పు అధికంగానే ఉంటుందని చెబుతున్నారు. అహ్మదాబాద్ లో ఈ వేరియంట్ 60 ఏళ్ల వృద్ధుడికి సోకింది. ఆయన రక్త నమూనాలను వైద్య పరీక్షలకు పంపగా బీఎఫ్ 7 వేరియంట్ తేలిందని వైద్యులు నిర్ధారించారు.
కోవిడ్ నిబంధనలను...
బీఎఫ్ 7 వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనంటున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులను ధరించడం విధిగా చేయాలని కోరుతున్నారు. అప్పుడే వ్యాధి వ్యాప్తి తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బీఎఫ్ 7 వేరియంట్ వేగంతో వ్యాప్తి చెందుతుందని, అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story