Mon Dec 23 2024 05:57:40 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ లో కూలిన ఛార్టర్ ఫ్లైట్
రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఛార్టెట్ ఫ్లైట్ కూలిపోయింది. సాంకేతికలోపం కారణంగా ఈ విమానం కూలిపోయింది
రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఛార్టెట్ ఫ్లైట్ కూలిపోయింది. సాంకేతికలోపం కారణంగా ఈ విమానం కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన ఈ విమానం ఉజ్జయిని ప్రాంతంలోని భరత్ పూర్ లో కుప్పకూలిపోయినట్లు తెలిసింది. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
సాంకేతిక లోపంతోనే...
ఈ ప్రమాదంలో ఎందరు మృతి చెందారన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు మాత్రం ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమేనని ప్రాధమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై విమానయాన శాఖ విచారణ జరుపుతుంది.
Next Story