Mon Dec 23 2024 20:16:36 GMT+0000 (Coordinated Universal Time)
సోనియా రేపు కీలక సమావేశం
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నివాసంలో రేపు కీలక సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నివాసంలో రేపు కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రణాళికపై నేతలతో సోనియా గాంధీ చర్చించనున్నారు. పార్టీ ప్రక్షాళన, సంస్థాగత ఎన్నికలు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వంటి అంశాలను సోనియా గాంధీ చర్చించనున్నారు.
జీ 23 నేతలను కూడా....
అయితే ఈ సమావేశానికి జీ 23 నేతలను కూడా ఆహ్వానించనున్నారు. ఈ సమావేశంలో వారి అభిప్రాయాలను కూడా సోనియా గాంధీ తీసుకోనున్నారు. ఇటీవల వారు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ప్రధానంగా శాశ్వత అధ్యక్షుడి నియమాకం, పార్టీ బలోపేతంపై చర్చించిన సంగతి తెలిసిందే. వారి అభిప్రాయాలను సేకరించడంతో పాటు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు.
Next Story