Mon Dec 15 2025 00:15:50 GMT+0000 (Coordinated Universal Time)
మరో విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ నుంచి లండన్ వెళుతున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది

ఢిల్లీ నుంచి లండన్ వెళుతున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి విమానం లండన్ బయలుదేరింది. బయలుదేరిన కాసేపటికేు బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా పైలట్ విమానాన్ని ఫ్రాంక్ఫర్డ్కు మళ్లించారు. విమానం ఫ్రాంక్ఫర్డ్ ఎయిర్ పోర్డులో ల్యాండ్ అయిన వెంటనే విమానాన్ని తనిఖీ చేశారు.
రెండు గంటల అనంతరం...
ప్రయాణికులను తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దాదాపు రెండు గంటల పాటు బాంబు బెదిరింపుతో విమానం ఆలస్యమయింది. తనిఖీల అనంతరం విమానం ఫ్రాంక్వర్డ్ నుంచి బయలుదేరి లండన్ కు వెళ్లింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడుతుంది.
Next Story

