Mon Dec 23 2024 04:22:01 GMT+0000 (Coordinated Universal Time)
బాలికతో మోదీ.. వైరల్ అయిన వీడియో
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరుపున ఒక బాలిక చేస్తున్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది
గుజరాత్ లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. భారతీయ జనతా పార్టీ ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, అమిత్ షా కేంద్ర మంత్రులందరూ గుజరాత్ లో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు...
అయితే బీజేపీ తరుపున ఒక బాలిక చేస్తున్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గత కొద్ది రోజులుగా ఆ బాలిక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ఆ బాలికను కలిశారు. ఆ బాలికతో ముచ్చటించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు ఆ బాలిక వివరిస్తుండగా మోదీ విని ఎంతో ఆనందించారు. ఆ బాలికను అభినందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Next Story