Sun Dec 22 2024 16:33:12 GMT+0000 (Coordinated Universal Time)
భర్తలందు ఇలాంటి భర్తలు వేరయా.. భార్య మనసు తెలుసుకుని..
వివరాల్లోకి వెళ్తే.. అమోయ్ పూర్వా గ్రామానికి చెందిన దినేశ్, గులాబీ లకు ఏడాది క్రితం వివాహమైంది. గులాబీ కొద్దిరోజులుగా..
ఆధునిక కాలంలో.. ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో అన్నట్టుగానే ఉంటుంది. అందరూ ఇలానే ఉంటారని కాదు. కానీ.. నూటికి 80-90 శాతం జంటల పరిస్థితి ఇదే. ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు అంగీకరించకపోవడం లేదా.. వాళ్లే విడిపోతుండటంతో.. మరొకరిని పెళ్లాడక తప్పట్లేదు. అయితే ఇటీవల కాలంలో కొందరు జీవిత భాగస్వాములు.. తమ భర్త లేదా భార్య మనసు తెలుసుకుని.. వారితోనే వారికి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఆ మధ్య ఓ మహిళ తన భర్తకు టిక్ టాక్ లో చూసి ప్రేమించిన యువతితో పెళ్లి చేయడం సంచలనమైంది. ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో భర్తలు.. తమ భార్యలు ప్రేమించిన యువకులతో వారి పెళ్లిళ్లు జరిపించిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. తాజాగా అలాంటి ఘటనొకటి ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అమోయ్ పూర్వా గ్రామానికి చెందిన దినేశ్, గులాబీ లకు ఏడాది క్రితం వివాహమైంది. గులాబీ కొద్దిరోజులుగా పక్కింట్లో ఉంటోన్న రాహుల్ అనే యువకుడితో తరచూ ఫోన్ మాట్లాడుతోంది. ఈ విషయం గమనించిన భర్త దినేశ్.. తొలుత ఆమెను మందలించాడు. ఆ తర్వాత ఆమె మనసును అర్థం చేసుకుని.. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అతనితో పెళ్లికి ఒప్పించాడు. గురువారం (జూన్29) సాయంత్రం ఓ గుడిలో తన భార్యకు, రాహుల్ కు సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించాడు. ఇంతలో విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టగా.. వాళ్లకు కూడా దినేశ్ అర్థమయ్యేలా చెప్పి.. ప్రేమికులను కలిపాడు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పాటు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. భర్తలందు నీలాంటి భర్తలు వేరయా అంటూ.. భార్య మనసు అర్థం చేసుకున్న ఆ భర్తను కొందరు పొగుడుతుంటే.. పెళ్లయ్యాక మరొ యువకుడిని ప్రేమించిన ఆమెను మందలించాల్సింది పోయి.. ఇదేం పని అంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు.
Next Story