Fri Nov 22 2024 22:37:13 GMT+0000 (Coordinated Universal Time)
పరస్పర అంగీకార విడాకులపై కేరళ హైకోర్టు కీలక తీర్పు
తాజాగా ఆ చట్టంలోని నిబంధనను పూర్తిగా రద్దు చేస్తూ కేరళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు..
పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు ఉన్న నిబంధనలపై కేరళ హైకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. క్రిస్టియన్లకు విడాకుల మంజూరుపై కీలక తీర్పును వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకునే ముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలని నిర్ధేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన్ 10ఏను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ఈ నిబంధన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. క్రిస్టియన్ కమ్యూనిటీలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే దంపతులు.. రెండేళ్లు విడివిడిగా ఉండాలని ఉన్న నిబంధనను.. 2010లో ఓ కేసు విషయంలో ఏడాదికి తగ్గించింది.
తాజాగా ఆ చట్టంలోని నిబంధనను పూర్తిగా రద్దు చేస్తూ కేరళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. దంపతుల మధ్య వచ్చే వైవాహిక విభేదాలను కోర్టు సాయంతో పరిష్కరించేలా చట్టం ఉండాలని తెలిపింది. ఒకవేళ పరిష్కారం సాధ్యం కాని పక్షంలో ఆ దంపతులకు ఏది మంచిదో నిర్ణయించేందుకు కోర్టుకు చట్టం అనుమతించేలా ఉండాలని హైకోర్టు పేర్కొంది. ఓ క్రిస్టియన్ జంట విడాకుల కేసు విచారణ విషయంలో కేరళ హై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
Next Story