Mon Dec 23 2024 13:53:46 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త ఏడాది.. తలుపుతట్టిన కోటి రూపాయలు
బీహార్ కు చెందిన ఒక వ్యక్తికి బంపర్ డ్రా తగిలింది. కొత్త ఏడాదికి ముందే కోటి రూపాయలు ఇంటి తలుపులు తట్టాయి
బీహార్ కు చెందిన ఒక వ్యక్తికి బంపర్ డ్రా తగిలింది. కొత్త ఏడాదికి ముందే కోటి రూపాయలు ఇంటి తలుపులు తట్టాయి. డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్ లో బీహార్ కు చెందిన రాజురామ్ కు కోటి రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు. కేవలం 49 రూపాయలతో టిక్కెట్ కొని తనకు తోచిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్నాడు. అదే జట్టు అగ్రస్థానంలో నిలవడంతో కోటి రూపాయలను సొంతం చేసుకున్నాడు.
డ్రీమ్ 11నుంచి...
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీకి సంబంధించి బ్రిస్పేన్ హిల్, సిడ్నీ థండర్ మంధ్య జరిగిన మ్యాచ్ లో ఈ వండర్ జరిగింది. ఉత్తమ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్న రాజురామ్ కు డ్రీమ్ 11 నుంచి కోటి రూపాయల బహుమతి లభించింది. పన్నులు మినహాయించగా 70 లక్షల రూపాయలు అతని ఖాతాలో పడ్డాయి. దీంతో రాజురామ్ కుటుంబం తొలుత ఆశ్చర్యంలో మునిగి ఆ తర్వాత తేరుకుని ఆనందంలో మునిగి తేలుతుంది.
Next Story