Mon Dec 23 2024 13:53:13 GMT+0000 (Coordinated Universal Time)
దారుణ ఓటమి.. దారులు వెతుక్కుంటారా?
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యనేతలు హాజరు కానున్నారు.
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం దక్కింది. ఏ రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలబడలేదు. అధికారంలోకి వస్తామనుకున్న పంజాబ్ లోనూ దారుణ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ లు కూడా ఓటమి పాలయ్యారు.
హాట్ హాట్ గానే...
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి శాశ్వత అధ్యక్షుడి నియామకంపై గళం విప్పారు. దీంతో హడావిడిగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఓటమికి బాధ్యులెవరో తేల్చాలంటూ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ ఓటమికి తానే బాధ్యుడినంటూ మరోసారి ఆయన తనపై వేసుకునే అవకాశముంది. ఇప్పటికి ఎన్నిసార్లు ఓటమికి బాధ్యత వహించారన్నది లెక్క లేదు. ఈ పరిస్థితుల్లో సీడబ్ల్యూసీ సమావేశం హాట్ హాట్ గా సాగే అవకాశముంది. అయితే సోనియా, రాహుల్ వీర విధేయులు మాత్రం ఓటమికి దారులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story