Mon Dec 23 2024 07:42:19 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఆకాశంలో అద్భుతం
రేపు సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.
బుధవారం సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధుడు, శుక్రుడు, బృహస్పతి, యురేనస్, మార్స్ గ్రహాలు చంద్రుని వరుసలో కనిపించనున్నాయని నాసా శాస్త్రవేత్త 'బిల్ కుక్' తెలిపారు. పశ్చిమ వైపు చూస్తే చంద్రుడితోపాటు బృహస్పతి, శుక్రుడు, మార్స్ మన కంటికి స్పష్టంగా కనిపిస్తాయని ఆయన తెలిపారు.
ముందస్తు ఏర్పాట్లు...
మిగిలిన బుధుడు, యురేనస్ గ్రహాలను చూడాలంటే బైనాక్యూలర్ వాడాల్సిందే. గతేడాది కూడా ఇలాంటి అద్భుతమే ఆకాశంలో కనువిందు చేసింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియంలోనూ కూడా ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Next Story