Fri Dec 20 2024 21:57:03 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మళ్లీ ప్రమాణ స్వీకారం...?
బీహార్ లో కొత్త ప్రభుత్వం రేపు ఏర్పాటు కానుంది. తిరిగి నితీష్ కుమార్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది
బీహార్ లో కొత్త ప్రభుత్వం రేపు ఏర్పాటు కానుంది. తిరిగి నితీష్ కుమార్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొద్ది సేపటి క్రితం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశఆరు. గవర్నర్ ఫగూ చౌహాన్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు కలసి బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కొత్త ప్రభుత్వంలో.....
రేపు బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది. జేడీయూను విడీసేందుకు బీజేపీ కుట్ర చేసిందని నితీష్ కుమార్ ఆరోపించారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన గవర్నర్ కు లేఖ ఇచ్చారు. రాజీనామా చేసిన అనంతరం నితీష్ కుమార్ రబ్రీదేవి ఇంటికి వెళ్లారు. అక్కడ తేజస్వియాదవ్ తో చర్చలు జరిపారు. కొత్త మంత్రివర్గంలో తేజస్వి యాదవ్ కు హోంమంత్రిత్వ శాఖ ఇవ్వనున్నారని సమాచారం.
Next Story