కొత్త కారు..కొన్న గంటల్లోనే యాక్సిడెంట్...రోడ్డుపై కూర్చుని..!!
పూణేలో కొత్తగా కొనుగోలు చేసిన నిస్సాన్ మ్యాగ్నైట్ కారుకు యాక్సిడెంట్. అదృష్టవశాత్తు ప్రాణనష్టం లేదు.

డెలివరీ తర్వాత కొన్ని గంటల్లోనే యాక్సిడెంట్ అయింది ఓ కస్టమర్ కొనుక్కున్న కారు.
ఆశగా కొనుగోలు చేసిన కారుకు కొన్న రోజునే యాక్సిడెంట్ గురువడంతో ఆ వ్యక్తి.. రోడ్డు మీద కూర్చుని బోరున విలపించాడు. ఆ కారుకు ఇంకా పూజలు చేసినట్లుగా దాని చుట్టూ పూలదండలు, రిబ్బన్లు అలాగే ఉన్నాయి. అంత కొత్త కారు ముందు అతడు అలా కన్నీరు పెట్టడం.. చూసేవారిని కలచి వేసింది.
కారణమేంటో తెలియరాని ఈ సంఘటన మహారాష్ట్ర లోని పూణే లో జరిగింది.
కారు డ్రైవర్ దాన్ని నడిపేటప్పుడు ఏకాగ్రత కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. .
పైన ఫోటో లో కనిపిస్తున్న కారు నిస్సాన్ మ్యాగ్నైట్ కారు. ఇది దేశంలో కాస్త తక్కువ ధరలో లభించే ఎస్యూవీ అని చెప్పవచ్చు. భారత్‌లో వినియోగదారుల నుంచి ఈ కారు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తక్కువ ధరలో SUV కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఫేవరేట్ కారుగా పేరు సంపాదించింది. అయినప్పటికీ దీన్ని కొనుగోలు చేయడం సామాన్యులకు ఓ పెద్ద కలనే!
డెలివరీ తర్వాత కొన్ని గంటల్లోనే ఈ కారు యాక్సిడెంట్‌కు గురైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ యాక్సిడెంట్లో ఎలాంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం జరగలేదు. కానీ, కారు పక్క భాగం కొద్దిగా దెబ్బతిని కనిపించింది.
కారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎలాగో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది కనుక కారును రిపేర్ చేసుకోవచ్చు.