Sun Feb 16 2025 17:09:32 GMT+0000 (Coordinated Universal Time)
మైసూరులో పట్టపగలే పులి దాడి
మైసూరు నగరంలో పులి దడ పుట్టించింది. నగరంలోకి వచ్చిన పులి ఒక వ్యక్తిపై దాడికి దిగింది
![tiger, attack, mysore tiger, attack, mysore](https://www.telugupost.com/h-upload/2022/11/04/1433122-tiger-attack-mysore.webp)
మైసూరు నగరంలో పులి దడ పుట్టించింది. నగరంలోకి వచ్చిన పులి ఒక వ్యక్తిపై దాడికి దిగింది. పట్టపగలే ఒక వ్యక్తిపై పులి దాడిచేసింది. దీంతో అక్కడ స్థానికులు అరవడంతో పులి పారిపోయింది. పులి దాడిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పులి నక్కి ఒక్కసారిగా వ్యక్తిపై దాడికి దిగింది.
బయటకు రావద్దంటూ....
పులి దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. పులిని పట్టుకునేందుకు మైసూరు నగరంలో వేట కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు.
Next Story