Mon Dec 23 2024 13:38:15 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కుర్రోడు కోటీశ్వరుడు.. కౌన్బనేగా కరోడ్పతిలో ఏడు కోట్లు తృటిలో మిస్సయిందిగా?
కౌన్బనేగా కరోడ్పతిలో కోటి రూపాయలను కుర్రోడు గెలుచుకున్నారు. ఏడు కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా క్విట్ అయ్యారు.
జాతీయ మీడియాలో కౌన్ బనేగా కరోడ్పతి ఎంతో ఫేమస్. ఇందులోకి ప్రవేశించాలంటే చాలా పరీక్షలుంటాయి. అన్ని విషయాల్లో సమగ్ర పరిజ్ఞానం ఉంటేనే ఈ షోలోకి అనుమతిస్తారు. అందులోనూ బిగ్ బి అమితాబ్ ఈ షో నిర్వహిస్తుండటంతో దీనికి మరింత క్రేజ్ పెరిగింది. దేశ వ్యాప్తంగా సెలక్షన్లు జరిగి చివరకు వడపోసి కొందరిని ఎంపిక చేస్తారు. అయితే అక్కడకు వెళ్లే సరికి తమకు వచ్చిన జ్ఞానాన్ని కూడా మరిచిపోయి కొందరు లక్ ను పోగొట్టుకుంటారు. మరికొందరు ధైర్యంగా ముందుకు వెళ్లి ఎంతో కొంత సంపాదించుకుని వెళతారు.
కోటి రూపాయలు గెలుచుకుని...
తాజా ఎపిసోడ్ లో కోటి రూపాయలను ఒక కుర్రోడు గెలుచుకున్నారు. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా క్విట్ అవ్వడంతో దానిని మిస్ అయ్యారు. కౌన్ బనేగా కరో్డ్పతిలో ఇరవై రెండేళ్ల కుర్రాడు కోటి రూపాయలను గెలుచుకున్నాడు. పదహారో సీజన్ లో కోటి రూపాయలను గెలుచుకున్న తొలి కంటెస్టెంట్ ఇతడే కావడం గమనార్హం. అయితే కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత ఏడు కోట్ల రూపాయల ప్రశ్న అమితాకౌన్బనేగా కరోడ్పతిలోబ్ వేసినా అది తెలుసు కానీ రిస్క్ ఎందుకని క్విట్ అయ్యాడు. కానీ ఆ సమాధానం నిజం కావడంతో ఏడు కోట్లు మిస్సయినట్లయింది.
Next Story