Mon Dec 23 2024 03:21:42 GMT+0000 (Coordinated Universal Time)
Aadhaar : నేడు ఆధార్, పాన్ కార్డుల అనుసంధాన గడువు లాస్ట్ డేట్
నేటితో ఆధార్, పాన్ కార్డుల అనుసంధాన గడువు ముగియనుంది.
నేటితో ఆధార్, పాన్ కార్డుల అనుసంధాన గడువు ముగియనుంది. ఈ రెండు జత చేయకపోతే అధిక మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. 2024 మార్చి 31 వరకు నిర్వహించిన లావాదేవీలపై మూలం వద్ద పన్ను కోత రెట్టింపు అవుతుందని తెలిపారు.
మే 31వ తేదీ నాటికి...
మే 31 నాటికి జత చేసిన వారికి టీడీఎస్ విధించబోమని ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులకు చెప్పింది. మే 31వ తేదీ లోగా ఆధార్, పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. రేపటి నుంచి వెయ్యి రూపాయల జరిమానాతో ఆధార్, పాన్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. రుసుము చెల్లించిన నాలుగైదు రోజుల తర్వాతనే అనుసంధానానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.
Next Story