Mon Dec 23 2024 12:41:49 GMT+0000 (Coordinated Universal Time)
మూడు నెలలు ఆధార్ అప్ డేషన్ ఫ్రీ..
తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకునే వారికి యూఐడీఏఐ కొంత వెసులుబాటు కల్పించింది. ఆధార్ అప్ డేషన్ కోసం..
మీరు ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు దాటిందా ? అయితే ఆధార్ అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం రూ.25 ఫీజుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వసూలు చేస్తోంది. అయితే.. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకునే వారికి యూఐడీఏఐ కొంత వెసులుబాటు కల్పించింది. ఆధార్ అప్ డేషన్ కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని నిర్ణయించింది. మార్చి 15 నుంచి జూన్ 14 వరకూ ఆధార్ అప్ డేషన్.. అవసరమైన గుర్తింపు పత్రాలతో ఆధార్ పోర్టల్ ద్వారా అప్ డేషన్ ప్రక్రియను ఉచితంగా చేసుకోవచ్చు.
అయితే.. ఈ ఆధార్ అప్ డేషన్ ఉచిత సేవలు ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతరత్రా మార్పుల కోసం మాత్రం అవసరమైన రుసుము చెల్లించాలని యూఐడీఏఐ అధికారులు స్పష్టం చేశారు. ఉచిత సదుపాయం కేవలం ఆధార్ అప్ డేషన్ కు మాత్రమేనని అధికారులు వివరించారు. ఈ నిర్ణయంతో లక్షలాది ప్రజలు లబ్ది పొందుతారని పేర్కొన్నారు. ఉచిత అప్ డేషన్ గడువు ముగిశాక రూ.50 చెల్లించి ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
- Tags
- UIDAI
- aadhar card
Next Story