Fri Nov 22 2024 21:03:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆధార్- పాన్ లింక్ కు మరోసారి గడువు పెంపు.. లింక్ చేసి తీరాల్సిందే..
కానీ ఇంకా చాలా పాన్ కార్డులు లింక్ అవ్వలేదు. దాంతో మరోసారి వీటిని లింక్ చేసుకునేందుకు గడువు పెంచింది.
ఆధార్ - పాన్ కార్డుల లింక్ కు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 31 తో పూర్తికానుంది. ఈనెల ఆర్థిక సంవత్సరానికి చివరి నెల కూడా. ఈ క్రమంలో ఆధార్ - పాన్ కార్డులను లింక్ చేయాల్సిందేనని కేంద్రం పదే పదే చెబుతోంది. కానీ ఇంకా చాలా పాన్ కార్డులు లింక్ అవ్వలేదు. దాంతో మరోసారి వీటిని లింక్ చేసుకునేందుకు గడువు పెంచింది. పాన్-ఆధార్ లింక్ గడువును జూన్ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది. ట్యాక్స్ చెల్లింపుదారులకు మరికొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పటికీ ఆధార్ - పాన్ కార్డులను లింక్ చేసుకోనివారు జూన్ 30 లోగా రూ.1000 అదనపు రుసుము చెల్లించి , మార్చి 31 వరకు ఆధార్-పాన్ ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. మూడు రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాన్-ఆధార్ లింక్ అయి ఉంటేనే బ్యాంకు ఖాతా, డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకునే వీలుంటుంది. టీడీఎస్ కూడా ఎక్కువగా కట్ అవకుండా ఉంటుంది. ఇప్పటి వరకూ 51 కోట్ల ఆధార్ - పాన్ కార్డులు లింకైనట్లు కేంద్రం వెల్లడించింది.
Next Story