Mon Dec 23 2024 09:14:26 GMT+0000 (Coordinated Universal Time)
కేజ్రీవాల్ ను జైలులోనే చంపేందుకు కుట్ర : ఆప్
జైల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మ్ పార్టీ ఆరోపించింది
జైల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మ్ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీపార్టీ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అక్రమంగా ఇరికించి తీహార్ జైలులో ఉంచిన అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుందని చెప్పారు. కేజ్రీవాల్ కు ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆప్ పార్టీ కార్యకర్తలలో నెలకొందన్నారు.
ఆరోగ్యం పాడవుతుందని...
ఆయనకు నిర్వహించే వైద్య పరీక్షలు కూడా అవే చెబుతున్నాయని తెలిపారు. కేజ్రీవాల్ కు జైలులో ఆహారాన్ని కూడా తగ్గించారని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతుందని అర్థమవుతుందని తెలిపారు. కేజ్రీవాల్ తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకుంటున్నారన్న లెఫ్ట్నెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంలో వాస్తవం లేదన్నారు. ఎవరైనా కావాలని తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారా? అని ప్రశ్నించారు.
Next Story