Fri Nov 22 2024 20:45:31 GMT+0000 (Coordinated Universal Time)
" ఆప్" ఇన్ ఛార్జులు వీళ్లే
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 9 రాష్ట్రాలకు సంబంధించి పార్టీ ఇన్ ఛార్జులను నియమించారు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 9 రాష్ట్రాలకు సంబంధించి పార్టీ ఇన్ ఛార్జులను నియమించారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీగా దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. దీనిని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలు కేజ్రీవాల్ మొదలు పెట్టారు. ఇందుకోసం వరసగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ ఛార్జులను కేజ్రీవాల్ నియమించారు. పంజాబ్ లో గెలిచిన ఉత్సాహంతో మిగిలిన రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కేజ్రీవాల్ ఈ చర్యలు తీసుకున్నారు.
ఎన్నికలు జరిగే....
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, అసోం, ఛత్తీస్ ఘడ్, కేరళ, పంజాబ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలకు కేజ్రీవాల్ ఇన్ ఛార్జులను నియమించారు. గుజరాత్ ఇన్ ఛార్జిగా డాక్టర్ సందీప్ పాఠక్, హిమాచల్ ప్రదేశ్ కు సత్యేంద్ర జైన్, దుర్గేష్ పాఠక్, హర్యానాకు సౌరభ్ భరధ్వాజ్, రాజస్థాన్ కు వినయ్ మిశ్రా, తెలంగాణకు సోమనాధ్ భారతి, ఛత్తీస్ ఘడ్ సంజీవ్ ఝా, కేరళకు రాజా, అసోంకు రాజీవ్ శర్మలను కేజ్రీవాల్ ఇన్ ఛార్జులుగా నియమించారు.
Next Story