Mon Dec 23 2024 09:53:13 GMT+0000 (Coordinated Universal Time)
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఇగుజరాత్ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు. జాతీయ పార్టీగా అవతరించిందని భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఇది షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు.
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు...
అయితే వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా వీరికి వర్తించదు. మెజారిటీ సభ్యులు పార్టీ మారడంతో ఈ చట్టం చెల్లదని చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో అక్కడే వీరి చేరిక ఉంటుందని తెలిసింది.
Next Story