Sun Nov 17 2024 16:00:08 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : నేడు ప్రధాని ఇంటి ముట్టడి.. ఢిల్లీలో హై అలెర్ట్
అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి నేడు పిలుపు నిచ్చారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి నేడు పిలుపు నిచ్చారు. దీంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేరుకునే అవకాశముండటంతో ఢిల్లీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంతో ఈ పిలుపు నిచ్చారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఇళ్లలో నుంచి బయటకు రాకుండానే ముందుగానే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆందోళనలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెప్పారు. పోలీసులు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రధాని నివాసానికి వెళ్లే తుగ్లక్ రోడ్డు, సఫ్తర్గంజ్ రోడ్డు, కేమల్ అటుటర్ మార్గ్ లలో వాహనాలకు అనుమతి లేదని నిషేధాజ్ఞలు విధించారు. ఇక్కడ వాహనాలను పార్కింగ్ కూడా చేయడానికి అనుమతి లేదని చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Next Story