Mon Dec 23 2024 10:09:32 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీని ఊడ్చేశారుగా?
ఢిల్లీని ఆమ్ ఆద్మీపార్టీ దక్కించుకుంది. ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై ఆప్ జెండా ఎగిరింది
ఢిల్లీని ఆమ్ ఆద్మీపార్టీ తన చేతికి దక్కించుకుంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై ఆప్ జెండా ఎగిరింది. 250 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాలను దక్కించుకుంది. అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ 126 వార్డులు కాగా, అదనంగా ఎనిమిది వార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకుంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన నేత మేయర్ సీటులో కూర్చోబుతున్నారు.
కాంగ్రెస్ పరిస్థితి....
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పదిహేనేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి కూడా తమదే విజయం అని కమలం పార్టీ గట్టిగా విశ్వసించింది. 104 వార్డులకే బీజేపీ పరిమితమయింది. పోలింగ్ తక్కువగా నమోదు కావడం వల్లనే తాము అధికారంలోకి రాలేకపోయామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థిి దారుణ:గా ఉంది. కేవలం 9 వార్డుల్లోనే కాంగ్రెస్ గెలిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి ఆరోపణలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని నిలువరించలేకపోయాయి. మొత్తం మీద ఢిల్లీలో చీపురుతో ఊడ్చేసింది.
Next Story