Wed Jan 01 2025 19:24:26 GMT+0000 (Coordinated Universal Time)
అధ్యక్ష పదవికి శశిధరూర్ పోటీ
ఈ నెల 24న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది
ఈ నెల 24న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సిద్ధమయ్యారు. ఆయన సోనియా గాంధీని కలసి అనుమతి తీసుకున్నారని తెలిసింది. రాహుల్ గాంధీ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడటానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో తాను పోటీ చేస్తానని శశిథరూర్ ముందుకు వచ్చారు. ఇందుకోసం ఆయన సోనియాగాంధీతో సమావేశమయ్యారు. పోటీకి సోనియా అనుమతి లభించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ మరోసారి....
రాహుల్ గాంధీయే మళ్లీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి నేతల వరకూ కోరుకుంటున్నారు. అనేక రాష్ట్రాల్లో పార్టీ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుని తీర్మానాలు చేసి పంపుతున్నారు. కానీ రాహుల్ గాంధీ మనసులో ఏముందో అన్నది ఇంత వకకూ తెలియరాలేదు. ఆయన ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్నారు. 24 వ తేదీన దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో రాహుల్ గాంధీ అంగీకరించి అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని కాంగ్రెస్ లో అత్యధిక శాతం మంది నేతలు కోరుకుంటున్నారు.
Next Story