Thu Dec 19 2024 13:06:59 GMT+0000 (Coordinated Universal Time)
లిఫ్ట్ కూలడంతో గనిలో పడిపోయిన 14 మంది.. చిక్కుకుపోయిన పదకొండు మంది కార్మికులు
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కంపెనీలోని మైనింగ్ లిఫ్ట్ కూలిపోపవడంతో పథ్నాలుగు మంది అందులో చిక్కుకున్నారు
రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కంపెనీలోని మైనింగ్ లిఫ్ట్ కూలిపోపవడంతో పథ్నాలుగు మంది అందులో చిక్కుకుని పోయారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఝంఝను జిల్లాలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుది. ఉంది. ఈ కంపెనీకి చెందిన కోలిహాన్ అనే గనిలో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో గనిలో లోప విధులు నిర్వహిస్తున్న 14 మంది అక్కడే చిక్కుకున్నారు. ఈ ప్రమాదం మంగళవారం అర్థరాత్రి జరిగింది.
సహాయక కార్యక్రమాలు...
సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగిలిన 11 మందిని గనిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే గనిలో చిక్కుకుని చాలా గంటలు కావడంతో అందులోని వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతంగా నిర్వహిస్తున్నారు.గని లోపల 1,800 అడుగుల లోతులో ఉండటంతో సహాయ చర్యలు ఆలస్యమవుతున్నాయి. లోపల చిక్కుకున్న 11మంది కూడా ప్రాణాలతోనే ఉన్నారని , వారిని రక్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Next Story