Fri Nov 22 2024 03:25:24 GMT+0000 (Coordinated Universal Time)
Beggars : బెగ్గర్స్ ఆదాయం ఏడాదికి ఇరవై కోట్లా...? మాఫియా గా ఏర్పడి మరీ
ప్రవేక్ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేల్లో ఇండోర్ నగరంలో బిక్షగాళ్ల ఆదాయం ఏడాదికి ఇరవై కోట్ల రూపాయలు ఉందని తెలిపింది.
బిక్షగాళ్ల ఆదాయం పై పలు కథనాలు వరసగా వస్తున్నాయి. పనీ పాటా లేకుండా చేతులు చాచి మరీ కోట్ల రూపాయలు కూడ బెడుతున్నారు. పోనీలే పాపం అన్న సానుభూతితో వేసే ప్రతి పైసా వారి ఖాతాల్లో జమ అవుతూ వస్తుంది. అందుకే ఇండోర్ మున్సిపాలిటీలో బెగ్గర్స్ ఆదాయం ఏడాదికి ఇరవై కోట్ల రూపాయలు అని తేల్చింది ఒక స్వచ్ఛంద సంస్థ. నమ్మినా.. నమ్మకపోయినా నిజం. ప్రవేక్ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన సర్వేల్లో ఇండోర్ నగరంలోని 38 రూట్లలో బిక్షగాళ్ల ఆదాయం ఏడాదికి ఇరవై కోట్ల రూపాయలు ఉందని తెలిపింది.
నెలన్నర రోజుల్లోనే...
ఈ అంకెలను చూసి అధికారులే అవాక్కవుతున్నారు. బెగ్గింగ్ కోసం ఒక ముఠాగా ఏర్పడి ఈ దందాకు తెరలేపిందన్న నిజాన్ని ఈ సంస్థ బయటపెట్టింది. బెగ్గింగ్ మాఫియా గుట్టును రట్టు చేసింది. కేవలం నెలన్నర రోజుల్లోనే ఒక బిక్షగత్తె రెండున్నర లక్షల మేర సంపాదించిందంటే చూసుకోండి మరీ అని చూపుతుంది. ఇంద్రాబాయి అనే మహిళ ఇండోర్ లో బెగ్గింగ్ ముఠాను మెయిన్ టెయిన్ చేస్తుంది. ఈ ముఠాలో ఈమెతో పాటు మొత్తం ఏడుగురు చిన్న పిల్లలున్నారని అధకారులు గుర్తించారు. బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని వీరు చేయిచాస్తూ వెంటపడుతుండటంతో వీరిని వదిలించుకునేందుకు తృణమో, ఫణమో ఇస్తుంటారు. అలా సంపాదించిన మొత్తంతో వీరు ఆస్తులు పోగేస్తున్నారు.
ఫిర్యాదు రావడంతో...
తమను బలవంతంగా యాచక వృత్తిలోకి ఇంద్రాబాయి దించిందని ఫిర్యాదు రావడంతో అధికారులు ఆమె ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఆస్తులను, బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి అవాక్కయ్యారు. రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో ఇంద్రాబాయికి రెండతస్థుల భవనం ఉంది. దీంతో పాటు వ్యవసాయ భూమి కూడా ఉంది. లక్ష రూపాయల నగదు తన బంధువులకు పంపినట్లు బ్యాంకు అకౌంట్లు చెబుతున్నాయి. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు బెగ్గర్స్ పై ఉక్కుపాదం మోపారు. పిల్లలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. మొత్తం మీద బిక్షగాళ్లు మాఫియా ముఠాగా ఏర్పడి కోట్లు వెనకేసుకు వస్తున్న ఈ దందాకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న అధికారుల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Next Story