Fri Nov 22 2024 20:38:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిత్య-L1 మిషన్: నేడు నింగిలోకి PSLVC-57 రాకెట్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. PSLVC-57 రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శుక్రవారం రోజు కౌంట్‌డౌన్ ప్రారంభించింది ఇస్రో 24 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ అనంతరం శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు. PSLVC-57 రాకెట్ ద్వారా సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-L1 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. కౌంట్‌డౌన్ సవ్యంగా సాగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ఆదిత్య L1 ద్వారా ఇస్రో సూర్యుడి జ్వాలలు, సౌర గాలులు, ప్లాస్మా తీరు, ఉపరితలం లక్షణాలు, రేడియేషన్ ప్రభావం, ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ వంటి అంశాలను పరిశోధించనుంది.
శనివారం ఉదయం 11.50కి ఆదిత్య L-1 ఆకాశంలోకి దూసుకెళ్లనుంది. ఆదిత్య L1 ఉపగ్రహం 1,475 కేజీల బరువు ఉంది. దీన్ని PSLV-C 57 రాకెట్లో నింగిలోకి పంపుతున్నారు. ఈ రాకెట్లో 1,231 కేజీల ద్రవ ఇంధనాన్ని నింపారు. ఈ ఇంధనాన్ని ఉపయోగించుకొని.. ఈ రాకెట్.. అంతరిక్షంలోకి శాటిలైట్‌ని పంపుతుంది. ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో దీన్ని వదులుతుంది. శాటిలైట్ సూర్యుడికి దగ్గర్లోని లాగ్రాంజియన్ పాయింట్ -1 లోకి వెళ్లాల్సి ఉంటుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి శాటిలైట్ వెళ్లడానికి 109 నుంచి 177 రోజులు పడుతుంది. ఆ తర్వాత L-1 పాయింట్ నుంచి సూర్యుణ్ని గమనిస్తూ కీలక డేటాను ఇస్రోకి పంపుతుంది.
Next Story