Sun Dec 22 2024 23:15:15 GMT+0000 (Coordinated Universal Time)
మే 30నే షిండేకు సీఎం పదవి ఆఫర్ ఇచ్చాం
రెబల్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిస్తామని ఆదిత్య థాక్రే సవాల్ చేశారు. డబ్బు కోసమే వారు పార్టీని వీడారన్నారు.
mumbai : షిండే ఇక్కడ ఉండే దమ్ములేకే పారిపోయాడని శివసేన యువనేత ఆదిత్య థాక్రే అన్నారు. డబ్బులు కోసమే ఎమ్మెల్యేలు గౌహతికి వెళ్లారన్నారు. శివసేన భవన్ లో పార్టీ యువజన విభాగంతో జరిగిన సమావేశంలో ఆదిత్య థాక్రే పాల్గొన్నారు. ప్రస్తుత సంక్షోభం శివసేన అంతర్గత వ్యవహారమంటూనే కేంద్ర ప్రభుత్వం రెబల్ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎందుకు కల్పించాలని ఆదిత్య థాక్రే ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. నిజమైన టైగర్లలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
డబ్బుకోసమే పార్టీని వీడి...
రెబల్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిస్తామని ఆదిత్య థాక్రే సవాల్ చేశారు. డబ్బు కోసమే వారు పార్టీని వీడి వెళ్లారన్నారు. గౌహతి హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తున్నారన్నారు. మే 30వ తేదీన తాము షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పామని ఆదిత్య థాక్రే చెప్పారు. అయినా పార్టీని చీల్చేందుకు కుట్ర చేశారని, ముంబయి వస్తే శివసైనికులు వదలరన్న భయంతోనే గౌహతిలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు.
Next Story