Tue Dec 24 2024 00:38:42 GMT+0000 (Coordinated Universal Time)
భారతదేశ బోర్డర్ లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ టెన్షన్
సెపాహిజాలా జిల్లా దేవిపూర్‌లో ఫామ్‌లో ఈ కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అగర్తల డిసీజ్ ఇన్వెస్టిగేషన్
భారతదేశ సరిహద్దుకు సమీపంలో ఉన్న భూటాన్ లోని పందుల ఫారమ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందిందని ప్రపంచ జంతువుల ఆరోగ్య సంస్థ (OIE) తెలిపింది. చుఖా జిల్లాలోని సెమీ-కమర్షియల్ పందుల పెంపకం చేస్తున్న ఫామ్ లలో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది.
తాజా సమాచారం ప్రకారం భారత్‌లో కూడా ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ తాకిడి మొదలైంది. త్రిపురలో జంతు వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ఫామ్‌లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కేసులను గుర్తించారు. సెపాహిజాలా జిల్లా దేవిపూర్‌లో ఫామ్‌లో ఈ కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అగర్తల డిసీజ్ ఇన్వెస్టిగేషన్ కేంద్రానికి చెందిన నిపుణుల బృందం అక్కడకు చేరుకుని, పరిస్థితిని అంచనా వేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను కూడా నియమించారు. ఫామ్‌లోని పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడటంతో ఫామ్ మొత్తానికి వ్యాపించి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయిన పందులన్నింటినీ వెంటనే చంపేయాలని త్రిపుర ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఏప్రిల్ 7న ఫామ్ నుంచి మూడు శాంపిల్స్‌ను ఈశాన్య రాష్ట్రాల డిసీజ్ డయాగ్నిస్టిక్ ల్యాబొరేటరీకి పంపారు.. ఏప్రిల్ 13న ఫలితాలు వెల్లడికాగా.. పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని త్రిపుర యానిమల్ హజ్బెండ్రీకి విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. ఆ పందులను చంపి పాతిపెట్టనున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటే ఏమిటి?
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF) అనేది దేశీయ, అడవి పందులకు వచ్చే అంటువ్యాధి.. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణాల రేటు 100% కి చేరుకుంటుంది. ఇది మనుషులపై పెద్దగా ప్రభావం చూపదు.. కానీ ఇది పందుల సంఖ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. ఈ వైరస్ బట్టలు, బూట్లు, చక్రాలు.. ఇతర పదార్థాలపై జీవించగలదు. ఇది హామ్, సాసేజ్లు లేదా బేకన్ వంటి వివిధ పంది మాంసం ఉత్పత్తులలో కూడా జీవించగలదు. ఈ వైరస్ సోకిన పందుల్లో సాధారణ స్వైన్ ఫీవర్ మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. పందుల్లో విపరీతమైన జ్వరం, నీరసం, ఆకలి మందగించడం, చర్మం ఎర్రగా ఉండటం, (రక్తమయమైన విరేచనాలు, వాంతులు. రక్తస్రావం, సైనోసిస్ (నీలిరంగు చర్మం), చర్మంపై భాగాలు నల్లబడటం(నెక్రోసిస్) వంటి లక్షణాలు ఉంటాయి.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి ఏదైనా వ్యాక్సిన్ ఉందా?
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎలా వ్యాపిస్తుంది?
వైరస్ సోకిన జంతువుల శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన జంతువులను తినే వస్తువులు, తిరిగిన ప్రాంతాల ద్వారా వ్యాపిస్తుంది. ప్రజల కారణంగా కూడా వ్యాప్తి జరగవచ్చు.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్: ప్రపంచ పరిస్థితిAfrican swine fever reported in Bhutan, near India border. What is this viral disease?
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూనే ఉంది, ఇది పంది ఆరోగ్యం, సంక్షేమానికి ముప్పు కలిగిస్తుంది. ఈ వ్యాధి ఆసియా, కరేబియన్, యూరప్, పసిఫిక్ అంతటా అనేక దేశాలకు చేరుకుంది. ఇది దేశీయ, అడవి పందులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
Next Story