Sat Nov 23 2024 07:42:19 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గిన యాక్టివ్ కేసులు.. శుభవార్తే మరి
భారత్ లో చాలా రోజుల తర్వాత వెయ్యికి లోపు కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ చాలా వరకూ అదుపులో వచ్చిందని భావించవచ్చు
భారత్ లో చాలా రోజుల తర్వాత వెయ్యికి లోపు కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ చాలా వరకూ అదుపులో వచ్చిందని భావించవచ్చు. అయినా ఒమిక్రాన్ వేరియంట్స్ తో ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కరోజులో 63,786 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 862 మందికి మాత్రమే కరోనా వైరస్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజులో 1,503 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
వ్యాక్సినేషన్...
దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.05 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4.46 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,28,980 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పుడు భారత్ లో యాక్టివ్ కేులు 22,549 కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 219.56 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు.
Next Story