Sat Dec 28 2024 02:40:40 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రైతు సంక్షేమం పై దృష్టి పెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రైతు సంక్షేమం పై దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి రాలేకపోవడంతో రైతుల ఎఫెక్ట్ బాగా పడిందని మోదీ సర్కార్ అభిప్రాయపడుతుంది. అందుకే రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర బడ్జెట్ లో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. నిధులను కూడా అత్యధికంగానే కేటాయించారు. తాజాగా రైతులకు సానుకూలంగా మరో నిర్ణయం ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ ద్వారా రైతులకు మూడు లక్షల రూపాయలు రుణం తీసుకున్న వారికి వడ్డీ రాయితీని కల్పిస్తుంది.
ఈ పథకం కింద...
ఈ పథకం కింద రైతులు ఏడు శాతం వడ్డీరేటుతో రుణం లభిస్తుంది. సకాలంలో రైతులు తాము తీసుకున్న రుణాలు చెల్లిస్తే అదనంగా మరో 3శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. 2024-25 సంవత్సరానికి నాలుగు శాతంచొప్పున స్వల్పకాలిక పంట రుణాలతో పాటు, పశుపోషణ, పాడిపరిశ్రమ, వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు స్వల్ప కాలిక రుణాలు అందుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. దీనివల్ల రైతులు ఎంతో లబ్ది పొందుతారని మోదీసర్కార్ భావిస్తుంది.
Next Story