Wed Nov 20 2024 15:27:58 GMT+0000 (Coordinated Universal Time)
యాభై వేలు దాటిన బంగారం.. మహిళలకు షాక్
చాలా రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలో తులం బంగారానికి వెయ్యి రూపాయలు పెరిగింది
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఒక్కోసారి మార్కెట్ నిపుణులకు కూడా అర్థం కాదు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుల ప్రకారం బంగారం ధరలు పెరుగుతుంటాయి. తగ్గుతుంటాయి. ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ధరల నిర్ణయం ఉంటుంది. డిమాండ్ ను బట్టి కూడా ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని నిపుణులు చెబుతారు. అదీ మన భారత్ లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉండటం కారణంగా బంగారం ధరల పెరుగుదల మనకు పెద్దగా అనిపించదు.
వెండి ధర కూడా....
చాలా రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలో తులం బంగారానికి వెయ్యి రూపాయలు పెరిగింది. దాదాపు మూడు, నాలుగు నెలల తర్వాత ఈ పెరుగుదల ఉందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,800 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,050 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 67,400 రూపాయలుగా ఉంది.
Next Story