Thu Dec 19 2024 18:14:05 GMT+0000 (Coordinated Universal Time)
కోల్కత్తా ఘటన.. ముగ్గురు పోలీసు అధికారులపై వేటు
కోల్కత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన అనంతరం ఆసుపత్రిలో దుండగులు సృష్టించిన విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్ అయింది
కోల్కత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కార్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి దుండగులు సృష్టించిన విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ సమయంలో ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో ఉన్న ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ కోల్కత్తా పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విధ్వంసం జరుగుతున్నా....
వీరిలో ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్స్పెక్టర్లు ఉన్నారు. హత్యాచారానికి నిరసనలు జరుగుతుంటే ముసుగులు ధరించిన కొందరు దుండగులు ఆసుపత్రిలోకి ప్రవేశించి ధ్వంసం చేయడాన్ని తప్పుపడుతూ ఈ చర్యలు తీసుకున్నారు. ఎమెర్జన్సీ వార్డుతో పాటు మెడికల్ షాపు, అవుట్ పేషెంట్ విభాగంలో దుండగుుల సామగ్రిని ధ్వంసం చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోలేదని వారిపై సస్పెండ్ వేటు వేసింది. వారి చేతులో పలు వాహనాలు కూడా ధ్వసం కావడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story