Mon Dec 23 2024 08:03:59 GMT+0000 (Coordinated Universal Time)
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
రెండేళ్ల క్రితం అతనికి వివాహమైంది. కొన్నాళ్లు కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ప్రతిరోజూ..
మృతదేహంపై కూర్చుని ఓ అఘోరా పూజలు చేయడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మృతదేహంపై కూర్చుని అఘోరా పూజ చేయడంతో.. హడలిపోయిన స్థానికులు ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలనే పూజ చేశానని అఘోరా చెప్పడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరు జిల్లాలోని సలూర్ సమీపంలో కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
రెండేళ్ల క్రితం అతనికి వివాహమైంది. కొన్నాళ్లు కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ప్రతిరోజూ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యతో ప్రతినిత్యం గొడవలతో మనస్తాపానికి గురైన మణికంఠన్ ఆదివారం (మే28) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి స్నేహితుడికి మణికంఠన్ ఆత్మహత్య విషయం తెలిసింది. భవబాంధవ్యాలకు దూరంగా.. అఘోరాగా ఉంటున్న అతను వెంటనే తన తోటి అఘోరాలతో కలిసి సలూర్ కు వచ్చాడు. మణికంఠన్ మృతదేహంపై కూర్చుని పూజలు చేశాడు. అనంతరం అతడి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. మృతదేహం పై అఘోరా కూర్చుని పూజలు చేయడం చూసి స్థానికులు భయపడ్డారు. అతని ఆత్మ శాంతించాలనే పూజలు చేశానని అఘోరా తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Next Story