Tue Apr 08 2025 19:51:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
మహారాష్ట్రలోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటి మీద ఆందోళన కారులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పుపెట్టారు

మహారాష్ట్రలోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటి మీద ఆందోళన కారులు దాడి చేశారు. ఆయన ఇంటికి నిప్పుపెట్టారు. సోలంకి అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత. మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉధృతం అయింది. ఎమ్మెల్యే ఇంటి బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు రాళ్లు రువ్వారు. ప్రకాష్ సోలంకి మరాఠా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న పటేల్ ను విమర్శించిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది.
మరాఠా రిజర్వేషన్లపై...
ప్రకాష్ సోలంకి ఇంటి బయట ఉన్న వాహనాలతో పాటు ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంటిలోనే ఉన్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గత కొద్దిరోజులుగా మరాఠా రిజర్వేషన్ల పోరాటం ఉధృతమయిన తరుణంలో ఈ ఘటన రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతుంది.
Next Story