Thu Nov 21 2024 21:13:17 GMT+0000 (Coordinated Universal Time)
మొట్ట మొదటిసారి తాజ్ మహల్ కు ఇంటిపన్ను నోటీసులు..
ఇంటిపన్ను చెల్లించని నేపథ్యంలో తాజ్ మహల్ ను అటాచ్ చేస్తామన్నారు. ఇంటి పన్ను చెల్లించకపోవడంతో వడ్డీ రూ.47 వేలు..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాలలో ఒకటైన తాజ్ మహల్ కు మొదటిసారిగా ఇంటి పన్ను నోటీసులిచ్చారు అధికారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి ఈ ఇంటిపన్ను నోటీసులు జారీ చేశారు. నిజానికి గతనెలలోనే నోటీసులు ఇచ్చినా.. అవి కొద్దిరోజుల క్రితమే అధికారులకు అందాయి. తాజ్ మహల్ పై ఉన్న రూ.1.4లక్షల ఇంటి పనున్ను 15 రోజుల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇంటిపన్ను చెల్లించని నేపథ్యంలో తాజ్ మహల్ ను అటాచ్ చేస్తామన్నారు. ఇంటి పన్ను చెల్లించకపోవడంతో వడ్డీ రూ.47 వేలు వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజ్ మహల్ కు వేసిన ఇంటి పన్ను రూ.11,098 అని అధికారులు తెలిపారు. కాగా.. తాజ్ మహల్ కు పన్నునోటీసులు జారీ చేయడంపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆశ్చర్యపోయింది. బ్రిటీష్ వారు పాలించిన నాటి నుండి ఇప్పటి వరకూ తాజ్ మహల్ కు పన్ను నోటీసులు రాలేదని, పన్ను కట్టమంటూ నోటీసులు పంపడం ఇదే మొదటిసారి అన్నారు. బహుశా పొరపాటున ఈ నోటీసులు వచ్చి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతుండగా.. మున్సిపల్ అధికారులు తాము ఈ బాధ్యతల్ని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు చెబుతున్నారు.
Next Story