Mon Nov 18 2024 04:39:58 GMT+0000 (Coordinated Universal Time)
ఎంఎస్ స్వామినాధన్ మృతి
వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన చెన్నైలో కన్నుమూశారు
వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాధన్ మృతి చెందారు. కొద్దిసేపటి క్రితం ఆయన చెన్నైలో కన్నుమూశారు. స్వామినాధన్ వయసు 98 సంవత్సరాలు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చెన్నైలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నైలోని ఆయన నివాసంలోనే మృతి చెందినట్లు చెప్పారు. స్వామినాధన్ మేలురకపు వరివంగడాలను సృష్టించారు. హరిత విప్లవ పితామహుడిగా స్వామినాధన్ పేరుపొందారు.
ఆహార వృద్ధికి...
భారత్ లో ఆహార వృద్ధికి స్వామినాధన్ చేసిన కృషి ప్రశంసనీయం. భారత్ ఆహార వృద్ధిలో స్వయం సమృద్ధి సాధించేందుకు విశేషంగా కృషి చేశారు. స్వామినాధన్ 1925 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. ఆయన అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. పద్మభూషణ్, పద్మశ్రీ, రామన్ మెగసెసే లాంటి అవార్డులను స్వామినాధన్ అందుకున్నారు. స్వామినాధన్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.
Next Story