Sun Dec 22 2024 21:55:22 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీతో కటీఫ్
బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలతో పొత్తుకు కటీఫ్ చెప్పేసింది
బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలతో పొత్తుకు కటీఫ్ చెబుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ తమిళనాట విడిగా పోటీ చేయనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని అన్నాడీఎంకే భావిస్తుంది. బీజేపీతో కలసి ఇన్నాళ్లూ నడిచిన అన్నాడీఎంకే ఎన్నికలు సమీపించిన తరుణంలో కటీఫ్ చెప్పేసింది.
వచ్చే ఎన్నికల్లో...
బీజేపీతో కలసి నడిస్తే ఉన్న ఓట్లు కూడా దక్కవని అన్నాడీఎంకే భావిస్తుంది. డీెఎంకే సొంతంగా పోటీ చేయడమా? తమిళనాడుకు చెందిన మరికొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు పోవాలని అన్నాడీఎంకే డిసైడ్ అయింది. కనీస స్థానాలను సాధించి కేంద్రంలో తమ అవసరం ఉన్న పార్టీకి మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతోనే బీజేపీతో తెగదెంపులు చేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈరోజు జరిగిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దక్షిణాదిన ఉన్న తమిళనాడులో కనీస స్థానాలను సాధించాలనుకున్న బీజేపీకి అన్నాడీఎంకే షాక్ ఇచ్చినట్లయింది.
Next Story