Thu Dec 19 2024 17:12:45 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో బయటకు వస్తే ఇక అంతేనట
ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత పెరిగింది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత పెరిగింది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. మాస్క్ లు ధరించడం తప్పనిసరిచేసింది. మాస్క్ లు ధరించకుండా ఢిల్లీ వీధుల్లో అడుగు పెడితే వ్యాధులు సోకడం గ్యారంటీ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.
పెరిగిన వాయుకాలుష్యం...
ఢిల్లీలో రోజురోజుకూ పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఐదు వందల పాయింట్లకు చేరుకుంది. దీంతో ఢిల్లీ వాసులు బయటకు రావాలంటే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ వీధుల్లోకి వచ్చేందుకు కూడా సాహసించడం లేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకుఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేదు. గత కొద్ది రోజులుగా వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టు సయితం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Next Story