Mon Nov 25 2024 07:55:32 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : నేడు సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై
ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో కాలుష్య నివారణకు నేడు సుప్రీంకోర్టు ఉత్తర్వులను జారీ చేయనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో కాలుష్య నివారణకు నేడు సుప్రీంకోర్టు ఉత్తర్వులను జారీ చేయనుంది. ఇప్పటికే కాలుష్యం కారణంగా ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాయు కాలుష్య ప్రభావంతో ఎక్కువ మంది వ్యాధుల బారిన పడుతుండటంతో సెలవులు ప్రకటించారు. బయటకు వస్తే మాస్క్ లను ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేడె్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ను కొనసాగించాలా? వద్దా అన్న అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్...
గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు ప్రారంభించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా 500 వరకూ పడిపోయింది. యమునా నదిలో విషపూరిత నురగలు రావడం కూడా ఢిల్లీ వాసుల ఆందోళనకు మరొక కారణమయింది. కొన్ని వాహనాలపై ఢిల్లీలో నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తుంది. పొగమంచుతో పాటు కాలుష్యం పెరగడంతో అనేక మంది శ్వాస కోశవ్యాధులతో బాధపడుతున్నారు. మరి సుప్రీంకోర్టు ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
Next Story