Fri Feb 21 2025 21:27:59 GMT+0000 (Coordinated Universal Time)
శబరిమల భక్తుకు గుడ్ న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు విమానయాన సంస్థలు శుభవార్త చెప్పాయి.

శబరిమల వెళ్లే భక్తులకు విమానయాన సంస్థలు శుభవార్త చెప్పాయి. విమానంలో ఇరుముడిని తీసుకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఇరుముడిని తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతించకపోవడంతో ఇప్పటి వరకూ అయ్యప్ప భక్తులు రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
ఇరుముడిని తీసుకెళ్లేందుకు...
అయితే తాజాగా విమానయాన సంస్థలు ఇరుముడిని తమ వెంట విమానంలోకి తీసుకు వెళ్లేందుకు అనుమతివ్వడంతో అయ్యప్ప భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా శబరిమల వెళ్లి స్వామి వారిని దర్శించుకునేందుకు వెసులుబాటు లభించిందని చెబుతున్నారు. ఇరుముడిని మకర జ్యోతి వరకూ అంటే జనవరి 14వ తేదీ వరకూ విమానంలో తీసుకు వెళ్లేందుకు విమానయాన సంస్థలు అనుమతిచ్చాయి.
Next Story