Sun Dec 22 2024 12:00:34 GMT+0000 (Coordinated Universal Time)
"మహా" సంచలనం.. 30 ఎమ్మెల్యేలతో ఎన్డీయే కూటమిలోకి అజిత్
అజిత్ పవార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించింది షిండే సర్కార్. ఛగన్ భుజ్ బల్, దిలీప్ పాటిల్..
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బాబాయ్ శరద్ పవార్ పై అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు అజిత్ పవార్. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ ఎన్డీయే కూటమికి చేరారు. షిండే సర్కారుకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు మద్దతు లేఖ అందజేశారు అజిత్ పవార్.
షిండే కేబినెట్ లో చేరిన అజిత్ పవార్.. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించింది షిండే సర్కార్. ఛగన్ భుజ్ బల్, దిలీప్ పాటిల్, ధనుంజయ్ ముండే లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. అజిత్ పవార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇకపై మహారాష్ట్రలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుందన్నారు. మహారాష్ట్రకు అంతా మంచే జరుగుతుందని పేర్కొన్నారు.
ఎన్సీపీలో కొద్ది రోజుల క్రితం నాయకత్వ మార్పు జరిగిన విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలేతో పాటు ప్రఫుల్ పటేన్ను నియమించారు. దాంతో అసంతృప్తికి గురైన అజిత్ పవార్ .. శరద్ పవార్ పై తిరుగుబాటుకు తెరలేపారు. ఊహించని ట్విస్ట్ తో మహా రాజకీయాల్లో సంచలనం రేగింది. మరోవైపు అజిత్ పవార్ రాజకీయ ద్రోహి అంటూ.. శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story