Mon Dec 23 2024 13:44:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆలియాకు థ్యాంక్స్ చెప్పిన మహేష్ కూతురు.. ఎందుకంటే
నన్ను మీ కుటుంబంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. మీరు పంపిన ..
స్టార్ హీరోలతో పాటు.. వారి ఫ్యామిలీలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి వారిలో మహేష్ కూతురు సితార కూడా ఒకరు. ఆమెకు ఇన్ స్టాలో ఏకంగా ఒక మిలియన్ మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆలియా భట్.. సితారను సర్ ప్రైజ్ చేస్తూ ఓ గిఫ్ట్ పంపింది. అవి తనకెంతో నచ్చాయంటూ.. సితార ఇన్ స్టా లో ఫోటోలు షేర్ చేస్తూ.. ఆలియాకు థ్యాంక్స్ చెప్పింది.
రెండేళ్ల క్రితం ఆలియా భట్ క్లాత్ బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తన బిజినెస్ లో సితార కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన దుస్తుల్ని సితారకు గిఫ్ట్ గా పంపింది ఆలియా. వాటిని వేసుకున్న సితార ఫోజులిస్తూ దిగిన ఫోటోలను ఇన్ స్టా షేర్ చేసి.. "నన్ను మీ కుటుంబంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. మీరు పంపిన డ్రెస్ లు నాకెంతో నచ్చాయి" అని తెలిపింది. కాగా.. ఆలియా ఇటీవల జూ.ఎన్టీఆర్ పిల్లలకు కూడా సర్ ప్రైజ్ గిఫ్ట్ లను పంపింది. ఈద్ కు ఎన్టీఆర్ కోసం స్పెషల్ అవుట్ ఫిట్ ను కూడా సిద్ధం చేస్తానని ఆలియా తెలిపింది.
Next Story